ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని యోగాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా ఆలయం ఆవరణలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 176 మందికి ఉచితంగా వైద్యం అందించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కిషోర్ కుమార్ సేవలందించారు. హెల్త్ సూపర్వైజర్ రమాదేవి, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.