నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచే విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి, శ్రీరామచంద్రమూర్తిని సర్వాలంకార భూషితుడిని చేసి, తన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వాహనంపై కొలువుదీర్చారు.