కేసీఆర్‌కు నచ్చితే ఎంత?.. నచ్చకుంటే ఎంత?: మంత్రి ఆనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామరాజ్యం ప్రారంభమైందని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన బాధాకరమని అన్నారు. చంద్రబాబు ఒక స్టేట్స్‌మెన్ అని ప్రపంచం కీర్తిస్తుందని, కేసీఆర్‌కు నచ్చినా నచ్చకపోయినా దానితో సంబంధం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన పనులతో, నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నానని, 2025లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని, అందులో తాను భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఒడి ద్వారా రూ.10,090 కోట్లు, స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్