నెల్లూరులో: 30 కోట్ల రూపాయల భారీ కుంభకోణం

గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో బాధితులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో వందలాది మంది నుంచి డిపాజిట్లు తీసుకొని నిర్వాహకులు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు, వారికి అండగా ఉంటామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్