మాజీ సీఎం జగన్ గురువారం నెల్లూరులో పర్యటించిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో మూడుకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రసన్న కుమార్ ఇంటివద్ద బారికేడ్లు తొలగించడంతో ఓ కానిస్టేబుల్ చేయి విరిగింది. ఈ ఘటనపై ప్రసన్నతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు, బైక్ ర్యాలీ నిర్వహించినందుకూ కేసులు నమోదు చేశారు.