కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన విజ్ఞప్తి

నెల్లూరు సిటీ, 16వ డివిజన్‌ను అభివృద్ధికి నిలువుటద్దంగా నిలిపిన కూటమి కార్పొరేషన్ డివిజన్ అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల తమ సన్నిహిత కుటుంబాలను కలిసి కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని, "ప్రజలే ముఖ్యం" అనే సిద్ధాంతాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ అభివృద్ధిని కొనసాగించే కూటమి అభ్యర్థులను గెలిపించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్