పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల నిల్వలపై ఆయన ఆరా తీశారు. పెట్రోల్ బంకు యాజమాన్యాలు, వాహనదారులతో స్వయంగా మాట్లాడారు. ఈ తనిఖీల్లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్