కోవూరు: ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో సుమారు 91 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ఆమె అందజేశారు. ఆసుపత్రి బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పునర్జన్మ ప్రసాదిస్తోందని, దీనికి కోవూరు ప్రజల తరపున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్