పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన పొదుపులో భాగంగా భారత ప్రధాని మోదీ పిలుపుతో, నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును టీడీపీ అధినేత చంద్రబాబు రద్దు చేసుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహించాలని భావించినా, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వర్చువల్ మహానాడు నిర్వహించాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారని, రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడుకు విశేష స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.