సంతపేట మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

నెల్లూరు సంతపేట మార్కెట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు 11 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నగర కమీషనర్ నందన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్