నెల్లూరు 47వ డివిజన్ పరిధిలోని నారాయణరావుపేటలో ఆటోలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గమనించిన డివిజన్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గణేశ్ కుమార్ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చేలోపే ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు మృతుడి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.