నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడ్ యెల్లో పేరుతో మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సంసిద్ధతను అంచనా వేయడానికి, బృందాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ డ్రిల్ ను నిర్వహించినట్లు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డా. కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ను సూపరింటెండెంట్ మాధవి, అనస్థీషియా విభాగాధిపతి శ్రీనివాస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కళారాణి పర్యవేక్షించారు.