నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతమ్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు శాంతమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఆమె కోటంరెడ్డిని ఆహ్వానించారు.