డిసెంబర్ 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

డిసెంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు శుక్రవారం ఇంధన సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాంప్లెట్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం, పలువురు ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్