ప్రజానాట్యమండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్య హత్యకు గురికావడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి, వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. పెంచలయ్య కుమారులను ఐఏఎస్, ఐపీఎస్ చేయించాలనే కోరికను నెరవేర్చే బాధ్యతను తన కుమార్తెలు, అల్లుళ్లు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.