నెల్లూరు: ఒకే బస్సులో 109 మంది..!

ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. శనివారం ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్లిన బస్సులో 49 సీటింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ 109 మంది ప్రయాణించారు. బస్సుల్లో అసలు ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు నిలబడటానికి కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులను ఆపడం కూడా కష్టంగా మారింది. దీంతో కొందరు ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్