ఊపిరితిత్తులకు సంబంధించి అరుదైన చికిత్స అందించి 22 ఏళ్ళ యువతి ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కాపాడారు. శనివారం నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డా. కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ కు చెందిన యువతికి తీవ్రమైన ఊపిరితిత్తి సమస్యతో ఊపిరితిత్తి ప్రధాన నాళం మూసుకుపోవడంతో స్టంట్ వేసి అత్యున్నత వైద్యం అందించామన్నారు.