నెల్లూరు: 4 గవర్నమెంట్ ఉద్యోగాలు..!

ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కష్టంగా మారిన ఈ రోజుల్లో, అనంతసాగరం (M) కొత్తపల్లికి చెందిన బీటెక్ పట్టభద్రుడు లాల్ అహమ్మద్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ కుమారుడైన లాల్ అహమ్మద్ 2019లో పంచాయతీ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు పొందాడు. ప్రస్తుతం మనుబోలు MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అతను, గ్రూప్-2 పరీక్షలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇది అతని కృషి, పట్టుదలకు నిదర్శనం.

సంబంధిత పోస్ట్