నెల్లూరు: ఒక్క రోజులోనే 90 శాతం పింఛన్లు

రాష్ట్రంలో ఒకేరోజులో 90 శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 11 డివిజన్లలో తుఫానును సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు. జోరు వానలోనూ ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్