మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని పోలీసు ఆంక్షలను సైతం లెక్కచేయకుండా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు గురువారం చేరుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.