ఆధునిక టెక్నాలజీ ఆసరాగా, వ్యవసాయాన్ని రైతుకు లాభదాయకంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ కోరారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్లో అగ్రిస్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ అధికారులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి పాల్గొన్నారు.