నెల్లూరు: పోలీసులు ఆపినా ఆగని అనిల్.!

నెల్లూరు జైలు సమీప హెలిపాడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద గురువారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు ఆపారు. వాహనం వివరాలు చెప్పకుండానే ఆయన ముందుకు వెళ్లిపోయారు. వాహనం ఆపాలని పోలీసులు అరిచినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. హెలిపాడ్ వద్ద 15 వాహనాలు, 10 మంది నేతలకు మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్