నెల్లూరు: హక్కులు అడిగితే.. దేశద్రోహం కేసులా

పౌర హక్కుల సంఘం నేతలపై అక్రమంగా బనాయించిన దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలో సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, బహుజన సంఘాలు, ఎస్ డిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తో పాటు పలువురు నేతలు అక్రమ కేసులను వ్యతిరేకించారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెట్టడం సమంజసం కాదని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్