వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం రాత్రి నెల్లూరులో మాట్లాడుతూ, టిడిపి గుండాలు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసి, ఇంటిపైకి వెళ్లి హత్యా ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. లోకేష్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు.