నగర మేయర్ పోట్లూరి స్రవంతి ఆదివారం ఒక ప్రకటనలో తుఫాన్ ప్రభావంతో పెను గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజ్ కాల్వల సమీపంలో నిలబడవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.