నెల్లూరు: వేమిరెడ్డి దంపతులను కలిసిన బీదా

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షులు బీద రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి బుధవారం నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ దంపతులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్