నెల్లూరు: విద్యార్థుల రక్తదాన శిబిరం

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు ధనలక్ష్మిపురంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ పోకల రవి పాల్గొన్నారు. శ్రీ చైతన్య సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని, తాను కూడా ఈ సంస్థలో విద్యార్థిగా చేరి డాక్టర్‌గా ఎదిగానని ఆయన తెలిపారు. ఏజీఎంలు శ్రీకాంత్, శ్రీరాములు, ఆర్ఐ వినయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్