ఇటీవల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో నల్లపరెడ్డి ఇల్లు మొత్తం ధ్వంసం అవడంతో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురువారం నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ దాడిని బొమ్మిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.