నెల్లూరు: ముగింపు దశకు చేరిన రొట్టెల పండగ

నెల్లూరులో రొట్టెల పండగ ముగింపు దశకు చేరుకుంది. బారా షహీద్ దర్గాలో బుధవారం తహలీల్ ఫాతెహా ప్రార్థనలు జరిపారు. భక్తులు మొక్కులు తీర్చుకుని ‘కోరికలు తీర్చండి, మళ్లీ వస్తాం’ అంటూ భగవంతుడిని ప్రార్థించారు. మత పెద్దలు గంధంతో మినార్‌కు ప్రదక్షిణలు చేసి, అమరవీరుల సమాధులకు లేపనం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లీం మత పెద్దలు ఎస్ఏం హుస్సేనీ, సాబిరాఖాన్, అబూబకర్, ఇస్మాయిల్ ఖాదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్