ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు భయపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరు నగరంలో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ని తలపించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి పై 14 కేసులు బనాయించారన్నారు.