భారత కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న నక్ష ట్రైనింగ్ వర్క్ షాప్ శిక్షణకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ గురువారం హాజరయ్యారు. బి. ఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ మీనా ఆధ్వర్యంలో జరగనున్న ఈ శిక్షణలో రాష్ట్రం నుంచి పలు మున్సిపల్ కమిషనర్లు పాల్గొంటున్నారు. ఈ శిక్షణ భూ వనరుల నిర్వహణపై దృష్టి సారిస్తుంది.