ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం విఆర్సి గ్రౌండ్ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు జీతాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, 14 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. పెంచల నరసయ్య, జిల్లా కార్యదర్శి ఆర్ఎం సునీల్ కుమార్ మాట్లాడారు.