నెల్లూరులో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.