విపిఆర్ దంపతుల ప్రోత్సాహంతో వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న నివాసం పైకి 200 మంది గంజాయి బ్యాచ్ ని పంపి ప్రసన్నను హత్య చేసేందుకు కుట్ర పన్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. గురువారం నెల్లూరు వైసిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల గొంతు నులుముతున్నారన్నారు. యువజన నేత కిషన్ తదితరులు పాల్గొన్నారు.