నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా టీడీపీ కార్పోరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి వాకౌట్ చేశారు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ లో తాము అనేక సమస్యలు లేవనెత్తామని, కానీ అవి పరిష్కరించలేదని, ఇక తాము సభ్యులుగా ఉండి ఏం చేసినట్లు అంటూ ఆయన ప్రశ్నించారు. మేయర్, కమిషనర్ మాట్లాడుకొని తీర్మానాలు చేసుకుంటున్నారని విమర్శించారు.