ప్రజా నాట్యమండలి కళాకారుడు, సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు అరవ కామాక్షిపై ఆర్డిటి కాలనీలో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో ఆమెకు చెందిన 5 ఇళ్లను స్థానికులు, టిడిపి, సిపిఎం కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అరవ కామాక్షి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని స్థానికులు ఆగ్రహంతో ఆమె నివాసాలను కూల్చివేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసిన పెంచలయ్యను దారుణంగా హతమార్చడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.