నేడు నెల్లూరు జిల్లా బంద్

ప్రజానాట్యమండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి, సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్యకు నిరసనగా, సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. గంజాయి అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ బంద్ కు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్