మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు.