సోమశిల డ్యాం పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తన నివాసం ముందు రహదారిపై శనివారం బైఠాయించి నిరసన తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు కూడా కాకానికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.