నెల్లూరు రూరల్ పరిధిలోని 20వ డివిజన్ ఇస్కాన్ సిటీ 2వ వీధిలో రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్డును టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 20వ డివిజన్ అభివృద్ధికి 4 కోట్ల 50లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. నూకరాజు మదన్, చేజర్ల కవిత మహేష్, పద్మజ యాదవ్, లక్ష్మీయాదవ్ పాల్గొన్నారు.