ఆషాడ మాసం సందర్భంగా శాకంబరి అలంకారంలో నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాకాంబరి అలంకారం సంబంధించి ఉభయకర్తలుగా కోలపర్తి వెంకట రమేష్ కుమార్, సువర్ణ లక్ష్మి, సాయి లిజిత్ కుమార్ దంపతులు వ్యవహరించారు.