నెల్లూరు: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో జూన్ 17వ తేదీన భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యుం, ఏపీఎస్ఎస్డిసీ జిల్లా అధికారి శ్రీధర్ లు మెగా జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేశారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్