అక్రమ మైనింగ్ కేసులో తన పేరు ఉందని అంటున్నారని, గతంలో కాకాణితో తనకు విభేదాలు ఉండేవని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో శుక్రవారం మాట్లాడిన ఆయన. తాము కలిసి వ్యాపారం చేస్తామని అన్నారు. తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని అమరావతికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకైనా సిద్ధమనని, క్వార్ట్జ్ మైనింగ్‌పై ఈడీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే జైలుకైనా వెళ్తానని చెప్పారు.