నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టే పాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అనంతరం టిడిపిలో విశేష సేవలు అందించారు. నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసిన ఆయన, కోటంరెడ్డి సోదరుల విజయానికి తన వంతు కృషి చేశారు.