నెల్లూరు: శాకాంబరి అలంకరణలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

నెల్లూరు నగర గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ఆదివారం శాఖంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. వివిధ కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో అమ్మవారి గీతాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి గిరి కృష్ణ, సురేంద్ర యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్