జగన్ గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయనకు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు స్వాగతం పలికారు. హెలికాప్టర్ దిగిన వెంటనే అనిల్‌కు జగన్ హగ్ ఇచ్చారు. అనంతరం రోడ్డు మార్గంలో జైలుకు బయల్దేరారు. అక్కడ మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లనున్నారు.