సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చిన జగన్ వైఖరి మారలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు మాగుంట లేఔట్ లో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించారని ధ్వజమెత్తారు. రఫ్ఫా రఫ్ఫా డైలాగులు నిజ జీవితంలో జరగవని అది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.