నెల్లూరు: జగన్‌ పర్యటన.. వైసీపీ నేతలకు నోటీసులు

నెల్లూరులో నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మందికే అనుమతి ఇచ్చారు. ప్రసన్న నివాసం వద్ద ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. జైలులో కాకాణిని కలిసి, అనంతరం నల్లపురెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా జనసమీకరణ చేయవద్దని సూచిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్