మాజీ సీఎం జగన్ పర్యటన కారణంగా నెల్లూరు నగరంలో పోలీసులు కఠినంగా ఆంక్షలు విధించారు. నెల్లూరు బ్యారేజీ మూసివేయడంతో నగరంలోకి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనాల్లో ఇరుక్కుపోయారు. మరోపక్క జగన్‌కు స్వాగతం పలికేందుకు మెయిన్ రోడ్డుపైకి వచ్చిన ప్రసన్నతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకోవడంతో, పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.