గంజాయి ముఠా నాయకురాలు కామాక్షిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు ఆర్డిటి కాలనీలో దారుణ హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గంజాయి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ ఆత్మకూరి, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర పాల్గొన్నారు.